24.7 C
Hyderabad
Monday, August 3, 2026

‘బతుకమ్మ’ కథనానికి స్పందన..

Must read

📰 Generate e-Paper Clip

  • బెల్ట్ షాపులలో పోలీస్ అధికారుల తనిఖీలు
  • సుమారు 27, 430 రూపాయల మద్యం బాటిళ్ళు స్వాధీనం

 

రుద్రూర్, బతుకమ్మ: రుద్రూర్ మండల కేంద్రంలోని “వైన్స్ నిల్.. బెల్ట్ ఫుల్.. బెల్ట్ షాపుల్లో విచ్చల విడిగా మద్యం అమ్మకాలు” అనే శీర్షికపై ఆదివారం రోజున బతుకమ్మ దినపత్రికలో ప్రచురితమైన వార్త కథనానికి రుద్రూర్ ఎస్సై సాయన్న వెంటనే స్పందించారు. ఆదివారం రాత్రి గ్రామంలోని అంగడి బజారు వద్ద శేర్యాల ప్రవీణ్ గౌడ్ కు చెందిన కిరాణా దుకాణాన్ని తనిఖీ చేయగా, రాయల్ స్టాగ్ – క్వాటర్స్ -(24), రాయల్ గ్రీన్ – క్వాటర్స్ – (24), ఓసి – 90 (50) బాటిల్లు, ఐబీ –  బాక్స్ (48)క్వాటర్స్, అదేవిధంగా జేయన్సీ కాలనీలోని ప్రధాన రహదారి ప్రక్కన గల పెంట శివకుమార్ కు చెందిన హోటల్ లో తనిఖీలు నిర్వహించగా, రాయల్ గ్రీన్ – 2 బాటిల్స్, లైట్ బీర్ – 1, ఐబీ- 90 ఎం.ఎల్ (8) డిప్పులు, ఎంసి – 90 (8) డిప్పులు, ఐబీ క్వాటర్స్ – 4  బాటిళ్ళ నిబ్బులను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరి వద్ద సుమారు 27, 430 రూపాయల మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకుని, ఇద్దరి పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాయన్న  వెల్లడించారు.

More articles

Latest article