28.2 C
Hyderabad

చట్టప్రకారం ఫిర్యాదులను పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య

 

నిజామాబాద్, బతుకమ్మ : పోలీస్ ప్రజావాణి ఫిర్యాదులను చట్టప్రకారం పరిష్కరించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులకు సూచించారు. నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ ప్రజావాణి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి 11 అర్జీలను స్వీకరించారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని సూచించారు. వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని తెలిపారు.

More articles

Latest article