28.3 C
Hyderabad

ఉచిత మెగా వైద్య శిబిరం

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్ : బోధన్ టౌన్‌లోని అమృత టు లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1200 మంది ప్రజలకు రక్తపరీక్షలు, సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. శిబిరంలో షుగర్, బీపీ, థైరాయిడ్, హీమోగ్లోబిన్, హృదయ సంబంధిత పరీక్షలు, పిల్లల వైద్యం మరియు ఎముకల సమస్యలపై ప్రత్యేక వైద్య సేవలు అందించారు. కార్యక్రమంలో డా. షేక్ షావలి (MD – జనరల్ మెడిసిన్), డా. ఎం.వి.ఎస్. సుధాకర్ (MS Ortho), డా. విగ్నేశ్వర (పెడియాట్రిక్స్) సేవలందించారు. ఈ శిబిరం విజయవంతం కావడంలో హాస్పిటల్ మేనేజ్‌మెంట్, సురేష్, మొహమ్మద్ ముక్తార్ మరియు సిబ్బంది కీలకపాత్ర పోషించారు.

More articles

Latest article