వెబ్ న్యూస్, బతుకమ్మ : విమానంలో శబరిమల వెళ్లే అయ్యప్ప స్వాములకు కేంద్రం శుభవార్త అందించింది. స్వాములు విమాన ప్రయాణ సమయంలో తమ పవిత్ర ఇరుమడిని (కొబ్బరి కాయతో సహా) ఇప్పుడు చేతి సామానుగా తమతో పాటు తీసుకెళ్లే విధంగా ప్రత్యేక వెసులబాటు కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు అమలులో ఉన్న భద్రతా నియామళి ప్రకారం ఇరుముడిని తప్పనిసరిగా చెక్-ఇన్ లగేజీగా పంపడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. భక్తుల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకొని శబరి మల వెళ్లే భక్తులు ఎయిర్ పోర్టు భద్రతా తనిఖీలను పూర్తి చేసినంతరం తమ ఇరుమడిని చేతి సామానుగా క్యాబిన్ లో తమతో తీసుకెళ్లవచ్చని సడలింపు ఇచ్చారు. ఈప్రత్యేక సడలింపు శుక్రవారం నుంచి జనవరి 20 వరకు దేశవ్యాప్తంగా వర్తిస్తుందని తెలిపారు.
