నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని మారుతి నగర్ లో గల స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ వారి దివ్యాంగుల పాఠశాలలో ఏరిస్ ఆగ్రో లిమిటెడ్ 56వ వార్షికోత్సవాన్ని కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరిస్ ఆగ్రో లిమిటెడ్ మేనేజర్ రామకృష్ణ మాట్లాడుతూ ఏరిస్ కంపెనీ 1969 సంవత్సరంలో ముంబైలో స్థాపించబడి ప్రస్తుతం 12 రాష్ట్రాల్లో పనిచేస్తుందని అదేవిధంగా నిజామాబాద్ లో కూడా పనిచేస్తున్నామని అన్నారు. ఏరీస్ కంపెనీ వార్షికోత్సవ సందర్భంగా దేశవ్యాప్తంగా వృద్ధులకు, అనాధలకు, దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుందని తెలిపారు. అందులో భాగంగానే స్నేహ సొసైటీ దివ్యాంగుల పాఠశాలలో దివ్యాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. వయోజన మానసిక వికలాంగులకు వృత్తి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయటంలో తమ సహకారాన్ని అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్. సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపల్ ఎస్. జ్యోతి, మానసిక వికలాంగుల పాఠశాల ప్రిన్సిపల్ పి, రాజేశ్వరి, ఎస్బిఐ బ్యాంక్ రిప్రజెంటేటివ్ చంద్రశేఖర్, సాయిలు ఏరీస్ కంపెనీ ఆఫీసర్, సురేష్ ఏరీస్ కంపెనీ డీలర్ వెంకటరెడ్డి ఆర్గానిక్ సేద్యం చేస్తున్న రైతు మానసిక వికలాంగులు, అంద విద్యార్థులు సిబ్బంది పాల్గొన్నారు.

