25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

చాకలి ఐలమ్మ విగ్రహానికి స్థలం కేటాయించాలని వినతి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి స్థలం కేటాయించాలని గ్రామపంచాయతీ సెక్రటరీ మహేష్ కుమార్ గౌడ్ కి రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం వినతిపత్రం అందజేశారు. రజక సంఘం సభ్యులు మాట్లాడుతూ రైతంగ సాయుధ పోరాట వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహం కోసం  గ్రామపంచాయతీ స్థలం కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం అధ్యక్షులు బుచ్చగారి రవి, దేవయ్య, చిన్న సాయిలు, మద్దూరి నర్సింలు, మద్దూరు రవి, బసగల రాములు, చంద్రం, లక్ష్మణ్ రజక సంఘం సభ్యులు ఉన్నారు.

More articles

Latest article