24.1 C
Hyderabad
Monday, August 3, 2026

మైనర్ బాలిక కిడ్నాప్

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైమ్, బతుకమ్మ : నిజామాబాద్ నగరంలోని రెండవ టౌన్ పరిధిలో మైనర్ బాలిక అపహరణకు గురైంది. ఈ సంఘటన మంగళవారం పోలీస్ లకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది. నగరంలోని హైమద్ పుర కాలనీకి చెందిన బాలికకు చిన్ననాడే తండ్రి చనిపోవడంతో తల్లి వదిలేసింది. మేనత్త వద్ద ఉండి ధర్మపురి హిల్స్ లోని మైనార్టీ స్కూల్లో బాలిక చదువుతోంది. సోమవారం కూరగాయలు తేవడానికి బయటకు వెళ్లిన బాలిక ఇంటికి తిరిగి రాకపోవడంతో మేనత్త చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

More articles

Latest article