30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

భర్తను మట్టుబెట్టిన ఇద్దరు భార్యలు

Must read

📰 Generate e-Paper Clip

  • కుటుంబ కలహాలే కారణమంటున్న గ్రామస్థులు
  • కేసు నమోదు చేసుకొని దర్యాప్తు నిర్వహిస్తున్న పోలీసులు

 

భీమ్ గల్, బతుకమ్మ : భార్యలిద్దరు తమకు తాళి కట్టిన భర్తపై పెట్రోల్ పోసి హత్య చేసిన ఘటన భీమ్ గల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవక్కాపేట్ లో కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు సంఘటన పూర్వపరాలు ఇలా ఉన్నాయి. దేవక్కాపేట్ కు చెందిన మాలవత్ మోహన్ (35) అలియాస్ బ్యాండ్ మోహన్ కు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య కవిత, చిన్న భార్య సంగీతా కాగావీరికి ఐదుగురు ఆడ సంతానం. కాగా వీరి భర్త మోహన్ వృత్తి పరంగా బ్యాండ్ మేళం వాయించడానికి వెళ్లి పొట్టపోసుకొనే వాడు. రోజు త్రాగడం, కొట్టడం, బూతులు తిట్టడం చేసేవాడాని,  ఆయన ఆగడాలు రోజు రోజుకు మితిమిరడం తో ఆగ్రహానికి గురైన చిన్న భార్య సోమవారం ఉదయం భర్తపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. ఉదయం త్రాగివచ్చి కుర్చీలో కూర్చొని ఇష్టరీతిన భార్యను తిట్టడంతో త్రాగుబోతు భర్త సాతాయింపు తాళలేక నిప్పంటించి హత్య చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పంచానామా నిర్వహించి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు పంపి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Two wives who killed their husbands

More articles

Latest article