24 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇందిరా మహిళా శక్తి  చీరల పంపిణీ

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బిచ్కుంద : తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అమలు చేస్తున్న”ఇందిరా మహిళా శక్తి”పథకంలో భాగంగా బిచ్కుంద మండలం వాజిద్ నగర్ గ్రామంలో మహిళలకు నాణ్యమైన చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు మండలంలో 18 ఏళ్లు నిండిన మహిళకు నాణ్యతతో కూడిన చీరలను పంపిణీ చేస్తున్నారు. బిచ్కుంద మండలం వాజిద్ నగర్ గ్రామంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వేలాది చీరలను గ్రామ గ్రామానికి పంపిణీ చేయడంతో మహిళలు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని నిర్దేశించి పిసిసి ఢిలీ గేట్ సభ్యులు విట్టల్ రెడ్డి మాట్లాడుతూ గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం తక్కువ నాణ్యత గల చీరలు పంపిణీ చేసినప్పటికిని ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అందిస్తున్న చీరలు అద్భుతమైన క్వాలిటీ రంగు మెటీరియల్ ఉన్నాయని ఆయన అన్నారు. ఆడపడుచులకు అందించే చీరలు నాణ్యతతో ఉండాలన్న సంకల్పంతో చీరల పంపిణీ విషయంలో పూర్తిస్థాయిలో పారదర్శకతను పాటించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బిచ్కుంద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు  దర్పల్ గంగాధర్, ఐకెపి ఎపిఎం డి రవీందర్, ఐ కెపిసీసీలు, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Indira Mahila Shakti sarees distribution

More articles

Latest article