సంగారెడ్డి, బతుకమ్మ : సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టును శనివారం నిపుణుల అధ్యయన కమిటీ పరిశీలించింది. సింగూరు ప్రాజెక్టు మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. మరమ్మతుల కోసం ప్రాజెక్టు ఖాళీ చేయాలా వద్దా అనే దానిపై అధికారులు పరిశీలన చేస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు డ్యామ్ ఖాళీ చేసి పనులు చేపట్టాలని సూచిస్తున్నారు. డ్యామ్ ఖాళీ చేస్తే 3 జిల్లాలకు తాగు నీటి ఇబ్బందులు తలెత్తుతాయని అధికారులు చెబుతున్నారు. జల మండలి అధికారులు కాఫర్ డ్యాం నిర్మించి పనులు చేపట్టాలని సూచిస్తున్నారు. సాధ్యాసాధ్యాలపై అధ్యయన కమిటీ సింగూరు ప్రాజెక్టు పరిశీలించింది.