30.9 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ కల్లుగీత వృత్తి సంఘం అధ్యక్షుడి బ్లాక్ మెయిల్ దందా

Must read

📰 Generate e-Paper Clip

  • ఎక్సైజ్ అధికారులకు డబ్బుల కోసం బెదిరింపులు
  • ఏసీబీకి ఫిర్యాదు చేస్తానని వేధింపులు
  • సీపీకి ఫిర్యాదు చేసిన నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ వో స్వప్న

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : రంగారెడ్డి, మెదక్, హైదరాబాద్, సిద్దిపేట్ ప్రాంతాల్లో పని చేస్తున్న ఎక్సైజ్ అధికారులను డబ్బులు ఇవ్వాలని బెదిరింపులకు పాల్పడుతున్నతెలంగాణ కల్లుగీత వృత్తి సంఘం అధ్యక్షుడు దానయ్యగౌడ్ పై నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేసు నమోదైంది. నిజామాబాద్ ఎక్సైజ్ ఎస్ హెచ్ వో స్వప్నను తనకు డబ్బులు ఇవ్వాలని లేకపోతే నెలవారిగా తీసుకుంటున్న ముడుపుల (మామూళ్ళ విషయాన్ని) బహిర్గతం చేస్తానని దానయ్యగౌడ్ బ్లాక్ మెయిల్ కు దిగాడు. ఈ విషయంలో సిఐ స్వప్న పట్టించుకోకపోవడంతో ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తానని మూడు పేజిల లేఖను రాసి వాట్సాప్ లో పంపించి బెదిరింపులకు దిగాడు. ఈ విషయంపై ఎస్ హెచ్ వో స్వప్న ఎక్సైజ్ అధికారులతో చర్చించారు. వారి సూచనల మేరకు నిజామాబాద్ పోలీసు కమిషనర్ సాయిచైతన్యను స్వయంగా కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దానయ్యగౌడ్ ఫోన్ చేసిన వివరాలను, వాట్సాప్ చాట్ ను పోలీసులకు అందించారు. పోలీసు కమిషనర్ స్పందించి దానయ్యగౌడ్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. నగరంలోని 3వ టౌన్ పోలీస్ స్టేషన్ లో తెలంగాణ కల్లుగీత వృత్తి సంఘం అధ్యక్షుడు దానయ్యగౌడ్ పై సెక్షన్ 308/4 ఎక్స్ ట్రాన్స్ కేసును నమోదు చేశారు. ఇటీవల కాలంలో జిల్లాలో అధికారులను కొందరు బెదిరింపులకు, బ్లాక్ మెయిల్ కు పాల్పడుతున్న నేపథ్యంలో మరిన్ని సంఘటనలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

More articles

Latest article