28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

రాజమౌళి బహిరంగ క్షమాపణ చెప్పాలి : వి హెచ్ పి

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, నిజామాబాద్ అర్బన్ : దర్శకుడు రాజమౌళి బహిరంగ క్షమాపణ చెప్పాలని వి హెచ్ పి ఇందూర్ విభాగ్ కార్యదర్శి తమ్మలి కృష్ణ డిమాండ్ చేశారు. విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.  హిందూ మతం, హనుమంతుని గురించి ప్రముఖ తెలుగు దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను దెబ్బతీశాయని అన్నారు. వారణాసి పేరును సినిమా టైటిల్‌గా ఉపయోగించడం, హిందూ ఇతిహాసాలను ఆధారంగా చేసుకుని భారీగా లాభాలు ఆర్జిస్తున్న రాజమౌళి ఇటీవలి వారణాసి సినిమా ఈవెంట్‌లో భగవంతునిపై విశ్వాసం లేదని, ప్రత్యేకంగా భక్తుల ఆదర్శ ప్రతిమ అయిన హనుమంతునిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అసహ్యకరమని మండిపడ్డారు. రాజమౌళి వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ ప్రకటించకపోతే, ఆయన సినిమాల ప్రదర్శనను అడ్డుకునే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. థియేటర్ల యజమానులు కూడా రాజమౌళి సినిమాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. హిందూ మతంపై సెలెబ్రిటీలు మాట్లాడేటప్పుడు బాధ్యతగా, ఆలోచించి వ్యాఖ్యలు చేయాలని సూచించారు ఈకార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, కోశాధికారి నాంపల్లి శేఖర్, జిల్లా సహా కార్యదర్శి దాత్రిక రమేష్, జల్లా సేవా ప్రముఖ్ రాంప్రసాద్ చటర్జీ, కార్యకర్తలు పాల్గొన్నారు.

More articles

Latest article