30.9 C
Hyderabad
Monday, August 3, 2026

హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక భద్రత కోసం ఆరోగ్య భీమా

Must read

📰 Generate e-Paper Clip

  • అదనపు డిసిపి (ఎఆర్) కె. రామచంద్ర రావు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : హోంగార్డుల ఆరోగ్యం, ఆర్థిక భద్రత కోసం ఆరోగ్య భీమా రక్షణగా నిలుస్తుందని అదనపు డిసిపి (ఎఆర్) కె. రామచంద్ర రావు అన్నారు. నిజామాబాదు జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అదనపు డిసి.పి (ఎఆర్) కె. రామచంద్ర రావు హోంగార్డుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య బీమా పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అదనపు డిసిపి (ఎఆర్) మాట్లాడుతూ పోలీసు వ్యవస్థలో అత్యంత ముఖ్య భూమిక పోషించే హోంగార్డులు ఆరోగ్యంగా, ఆర్థికంగా భద్రంగా ఉండటం మా మొదటి బాధ్యత అన్నారు. సేవలో నిమగ్నమయ్యే సమయంలో ఎలాంటి అనారోగ్య సమస్య వచ్చినా, ఆరోగ్య భీమా మీకు రక్షణ కవచంలా నిలుస్తుందని తెలిపారు. చిన్న సమస్యలు పెద్ద భారం కాకుండా ముందుగానే భీమా తీసుకోవడం ద్వారా కుటుంబాల భవిష్యత్తు పదిలమవుతుందన్నారు. మీ ఆరోగ్యం – మీ కుటుంబ ఆనందం. అందరికీ పూర్తి అవగాహనతో, నిర్భయంగా ఆరోగ్య భీమా తీసుకొని భద్రతను పెంపొందించుకోవాలని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్స్  హెచ్.సతీష్ (హోమ్ గార్డ్స్), శేఖర్ బాబు (ఎమ్.టి.ఓ), కె. శ్రీనివాస్ (అడ్మిన్), తిరుపతి (వెల్ఫేర్), కార్పొరేట్ శాలరీ మేనేజర్ సి.వెంకటేష్, బ్యాంక్ అధికారులు, హోంగార్డ్ సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.

Health insurance for the health and financial security of home guards

Health insurance for the health and financial security of home guards

More articles

Latest article