28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

వైన్స్ షాప్ ను తొలగించాలని కాలనీవాసుల ధర్నా

Must read

📰 Generate e-Paper Clip

  • తాసిల్దార్ కార్యాలయ సిబ్బందికి వినతిపత్రం అందజేత

 

బతుకమ్మ, కోటగిరి : తమ కాలనీ నుండి వైన్స్ షాప్ తొలగించాలని వినాయక్ నగర్ కాలనీ వాసులు అంబేద్కర్ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించి  తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా  వారు మాట్లాడుతూ.. వినాయక్ నగర్ కాలనీకి వెళ్లే దారిలో వైన్స్ షాప్ ఉండడం వల్ల మద్యం షాపు తెరిచి నుండి మూసేంతవరకు మందుబాబులు ఫుల్లుగా మద్యం సేవించి రోడ్డుపై పడిపోవడంతో కాలనీలోని మహిళలు, చిన్న పిల్లల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వైన్ షాప్ ను తొలగించాలని  తాసిల్దార్ కు జిల్లా కలెక్టర్ సైతం ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. వెంటనే ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి మద్యం షాపును ఇక్కడి నుంచి తరలించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు సిరాజ్,  సాయిబాబు,లింగరాం,తోట విజయ్, పుల్కాంటి వీరేషం,మామిడి సాయిలు, డాన్ రాజు,హైమద్, ముదస్సిర్, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.

Colony residents protest to remove wine shop

More articles

Latest article