మోర్తాడ్, బతుకమ్మ: ప్రతి విద్యార్థి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ విద్యాబుద్ధులు నేర్పుతూ విద్యార్థులను సన్మార్గంలో నడపడంలో అందరికీ ఆదర్శప్రాయుడు మగ్గిడి ప్రవీణ్ అని మోర్తాడ్ విద్యా అధికారి సమ్మిరెడ్డి అన్నారు. అతను ఏ పాఠశాలలో పనిచేసిన విద్యార్థులను ప్రతి సబ్జెక్టులో అన్ని విషయాలపై తర్ఫీదు చేసి తీర్చిదిద్దడంలో సిద్ధఅస్తుడు పేర్కొన్నారు. పదోన్నతిపై జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తొర్తికి వెళ్లిన మోర్తాడ్ మండల పి ఆర్ టి యు మాజీ అధ్యక్షులు మగ్గిడి ప్రవీణ్ కు బుధవారం ఘనంగా నిర్వహించిన వీడుకోలు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్ శాలువాతో ఘనంగా సన్మానించి జ్ఞాపికనంద చేశారు. కార్యక్రమంలో డోన్కల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు జగదీశ్వర్, మోర్తాడ్ మండల పిఆర్టియు అధ్యక్షులు ప్రగతి కుమార్, ప్రధాన కార్యదర్శి రాములు ,అసోసియేట్ అధ్యక్షులు రవిరాజు, జిల్లా ఉపాధ్యక్షులు జగదీశ్వర్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సాయి రెడ్డి ,ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, శ్రీనివాస బాలు, రాజేందర్ రాష్ట్ర, జిల్లా, మండల కార్యవర్గ సభ్యులు పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
