ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని హర్షితను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. రాష్ట్రస్థాయి టిసాట్,తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జాయింట్ గా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో రాష్ట్ర ప్రథమ బహుమతి సాధించి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు చేతుల మీదుగా బహుమతి స్వీకరించి మన నిజామాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చిన సందర్భంగా పిఆర్టీయు ఇందల్వాయి మండల శాఖ అధ్యక్షులు కె.భార్గవ ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాస్ లు విద్యార్థినిని శాలువాతో సన్మానించారు. ప్రోత్సాహకంగా విద్యార్థినికి 500 రూపాయలు బహుమతిగా ఇచ్చారు. అనంతరం ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు హర్షితను స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో విద్యార్థులు విద్యారంగంలో ముందుండాలని సూచించారు.విద్యార్థికి మెంటర్ గా వ్యవహరించిన ప్రధానోపాధ్యాయులు గంగాధర్ కృషిని అభినందించారు. కార్యక్రమంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మాధురి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్యామలశ్రీ, ముబాసిర్,ఉన్నత పాఠశాల,ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

