రాష్ట్ర ప్రథమ బహుమతి విద్యార్థినికి సన్మానం
ఇందల్వాయి, బతుకమ్మ : ఇందల్వాయి మండలంలోని నల్లవెల్లి ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని హర్షితను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించారు. రాష్ట్రస్థాయి టిసాట్,తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం జాయింట్ గా నిర్వహించిన వ్యాసరచన పోటీలలో రాష్ట్ర ప్రథమ బహుమతి సాధించి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు చేతుల మీదుగా బహుమతి స్వీకరించి మన నిజామాబాద్ జిల్లాకు మంచి పేరు తీసుకువచ్చిన సందర్భంగా పిఆర్టీయు ఇందల్వాయి మండల శాఖ అధ్యక్షులు కె.భార్గవ ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాస్ లు విద్యార్థినిని...