25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

ఫిర్యాదులను చట్టపరంగా పరిష్కరించాలి

Must read

📰 Generate e-Paper Clip

  • పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
  • పోలీస్ ప్రజావాణికి 20ఫిర్యాదులు

 

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : పోలీస్ ప్రజావాణికి వచ్చిన ఫిర్యాదులను చట్టపరంగా పరిష్కరించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. నిజామాబాదు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాలను నుంచి వచ్చిన ఫిర్యాదుదాల నుంచి 20 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్టప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబందిత అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలు నిర్భయంగా, మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి, పైరవీలు లేకుండా స్వచ్చందంగా పోలీసు సేవల్ని వినియోగించుకోవాలని అన్నారు. వారి వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా, పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా, శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ పని చేస్తుందని తెలిపారు.

More articles

Latest article