26.3 C
Hyderabad
Monday, August 3, 2026

మద్యం సేల్ పెంచాలని తనిఖీలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ ఎక్సైజ్ జిల్లా పరిధిలో మద్యం అమ్మకాలను పెంచేందుకు అబ్కారి శాఖ కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్ మాసం కు సంబందించిన లక్ష్యం చేరకపోవడంతో రెండు రోజులలో అమ్మకాలు పెంచేందుకు నడుం బిగించింది ఎక్సైజ్ శాఖ. ఈనెల చివరకు మరో రెండు రోజులు ఉండటంతో మద్యం అమ్మకాలు తక్కువగా ఉన్న దుకాణాలలో తనీఖీలు నిర్వహించారు. జిల్లాలో 102 మద్యం దుకాణాలలో, 18 బార్ లలో మద్యం అమ్మకాలు లక్ష్యం చెరకపోవడంతో తక్కువ సెల్ జరిగిన దుకాణాలలో సోదాలు నిర్వహించారు. జిల్లాలో ఈ నెల లక్ష్యం రూ. 105 కోట్లు కాగా ఇప్పటి వరకు జిల్లాలో రూ.20 కోట్ల మేర తక్కువ అమ్మకాలు జరిగాయి. రెండు రోజులలో ఇరవై కోట్ల లక్ష్యం చెరేందుకు మాక్లూర్ లోని ఐఎంఏల్ డిపోను సెలవు రోజైనా అదివారం కుడా తెరిచి ఉంచుతున్నట్లు అధికారులు తెలిపారు. మద్యం సెల్ పెంచాలని పైనుంచి అదేశాలు ఉండటంతో శని, అదివారాలలో ఎక్సైజ్ అధికారులు సిబ్బందికి తిప్పలు తప్పెలా లేవు.

More articles

Latest article