మద్యం సేల్ పెంచాలని తనిఖీలు

నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ ఎక్సైజ్ జిల్లా పరిధిలో మద్యం అమ్మకాలను పెంచేందుకు అబ్కారి శాఖ కసరత్తు చేస్తోంది. సెప్టెంబర్ మాసం కు సంబందించిన లక్ష్యం చేరకపోవడంతో రెండు రోజులలో అమ్మకాలు పెంచేందుకు నడుం బిగించింది ఎక్సైజ్ శాఖ. ఈనెల చివరకు మరో రెండు రోజులు ఉండటంతో మద్యం అమ్మకాలు తక్కువగా ఉన్న దుకాణాలలో తనీఖీలు నిర్వహించారు. జిల్లాలో 102 మద్యం దుకాణాలలో, 18 బార్ లలో మద్యం అమ్మకాలు లక్ష్యం చెరకపోవడంతో తక్కువ సెల్ జరిగిన దుకాణాలలో సోదాలు నిర్వహించారు. జిల్లాలో ఈ...