ముప్కాల్, బతుకమ్మ: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని ముప్కాల్ మండలంలోని రెంజర్ల గ్రామంలో గల విజ్ఞాన్ పాఠశాలలో చిన్నారులు చేసిన నృత్యాలు, పాడిన పాటలు నాటికలు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని పాఠశాల కరస్పాండెంట్ సోహెల్ అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో మంచి ప్రతిభ చూపించిన విద్యార్థులను పాఠశాల సిబ్బంది అభినందించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
