నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని స్నేహ సొసైటీ ఫర్ రూరల్ రీకన్స్ట్రక్షన్ దివ్యాంగుల పాఠశాలలో (బాలల దినోత్సవ) చిల్డ్రన్స్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు దేశ స్వాతంత్ర్య సమరయోధుల రూపాలలో వేషధారణతో విభిన్న పలు సాంస్కృతిక ప్రదర్శనలను తిలకించి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పండిత్ జవార్ లాల్ నెహ్రూ దేశ ఐక్యత, స్వాతంత్ర్యం కోసం, పిల్లలంటే ఎందుకు అంత మక్కువ అన్న విషయాలను క్లుప్తంగా విద్యార్థిని విద్యార్థులకు తెలియజేశారు. జైల్లో ఉన్నప్పటికీ గాను తన కూతురు మీద ఉన్న ప్రేమానురాగాలతో, చిన్నారులపై ఉన్న ప్రేమతో పక్షులు పువ్వులు గాలి బుగ్గలు పిల్లల మీద ఉన్న అమితమైన ప్రేమను దృష్టిలో ఉంచుకొని ది వింగ్స్ ఆఫ్ ఇండియా అనే బుక్కును రచించారని తెలియజేశారు. అలాగే అన్నింటిలో కూడాను ఆడపిల్లలు ఒక ఉన్నత స్థాయిలో ప్రతి విషయంలో ముందంజలో ఉండాలని ఆకాంక్ష ఆయనలో ఉందని తెలిపారు. స్త్రీ ఒక శక్తి స్వరూపిణి అని కొనియాడారు. ఎందుకంటే పూర్వకాలం నుండి ఇప్పటివరకు దేవత మూర్తులు అందరూ కూడాను అమ్మవారి రూపంలో వివిధ పేర్లతో కొలవడం మొక్కడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆడపిల్లలను గౌరవించాలని సూచించారు. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ శాఖలోని అన్ని విభాగాల్లో సైతం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళల పట్ల గౌరవమివ్వడం అనే విషయాలపై ఎక్కువగా చెప్పడం జరుగుతుందన్నారు. బేటి బచావో బేటి పడావో అనే నినాదంతో ఆడపిల్లల అభ్యున్నతి కోసం ముందుకు వెళ్లడం జరుగుతుందని తెలిపారు. దివ్యాంగ విద్యార్థుల అయినప్పటికీ సకలాంగులకు దీటుగా దేశ స్వాతంత్ర్య సమరయోధుల రూపాలలో ముస్తాబై పాశ్చాత్య పోకడాలకు పోకుండా సినిమా పాటలు లేకుండా కేవలం దేశానికి సంబంధించిన, అన్నదాతలకు సంబంధించిన పాటలతో సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం ఎంతో హర్షించదగ్గ విషయమని పేర్కొన్నారు. పిల్లలు దైవంతో సమానమని వారు సంతోషంగా బాల్యాన్ని ఆస్వాదించాలని వారికి ప్రతి ఒక్కరు అండగా ఉండాలని సూచించారు. దివ్యాంగుల విద్యార్థుల ఉన్నతి కోసం ఇన్ని సంవత్సరాలుగా కృషి చేస్తున్న స్నేహ సొసైటీ కార్యదర్శి ఎస్.సిద్దయ్య, అందుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల ప్రిన్సిపాల్ రాజేశ్వరి, స్నేహ సొసైటీ సిబ్బందిని అభినందించారు. అనంతరం పలు సాంస్కృతిక ప్రదర్శనలు విద్యార్థులు ప్రదర్శించారు. ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ మనోజ్ సాయి, గైనకాలజీ వైద్యులు డాక్టర్ ఇందు, దయానంద్, రమణారెడ్డి, జీవన్ రావు, సుధాకర్, ఆయా రంగాల్లో తమ ప్రతిభను కనబరుస్తూ పదిమంది పిల్లలకు ఆదర్శంగా నిలుస్తున్న విద్యార్థిని, విద్యార్థులను శాలువాలతో ఘనంగా సన్మానించారు. సాంస్కృత ప్రదర్శనలు ప్రదర్శించిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.

