- జిల్లా న్యాయమూర్తి సునిత కుంచాల
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ: నిజామాబాద్ జిల్లాలో అన్ని కోర్టులలో జాతీయ లోక్ అదాలత్ సంధర్బంగా 26,026 కేసుల పరిష్కరం చేసినట్లు జిల్లా న్యాయమూర్తి సునిత కుంచాల తెలిపారు. జిల్లా కోర్టు కాంప్లెక్స్ తో పాటు బోదన్, ఆర్మూర్ కోర్టులలో 86 సివిల్ కేసులు,15666 క్రిమినల్ కేసులు, 10234 ప్రి లిటిగేషన్ కేసులు పరిష్కరించినట్లు జిల్లా జడ్జీ తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థతో పాటు జిల్లా అధికార యంత్రాంగం, పోలిస్ శాఖలతో సమన్వం చేసి జిల్లాలో జాతీయ లోక్ ఆదాలత్ ను సక్సెస్ చేసినట్లు తెలిపారు.
