27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

Must read

📰 Generate e-Paper Clip

నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల కాలంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతిపై పలు ఆరోపణల నేపథ్యంలో నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించారు. ఈ యేడాది నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ శ్రీరామరాజు ఏసీబీకి చిక్కిన విషయం తెల్సిందే. ఉమ్మడి జిల్లాలో పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా ఏసీబీకి చిక్కిన, దాడులు జరిగిన కార్యాలయం నిజామాబాద్ అర్బన్ కార్యాలయంగా రికార్డులకెక్కింది. నిజామాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలతో డాక్యుమెంట్ రైటర్లు దుకాణాలకు తాళాలు వేసి గప్ చుప్ అయ్యారు.

ACB searches at registration office

More articles

Latest article