హైదరాబాద్, బతుకమ్మ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కౌంటింగ్ కేంద్రం నుంచి బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి వెనుదిరిగారు. ఈసందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. డిపాజిట్ వస్తుందనే భావిస్తున్నామని, చివరి మూడు రౌండ్లు తమకు అనుకూలంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం వేశారు. దీపక్ రెడ్డి తీవ్ర నిరాశలో కనిపిస్తున్నారు.
