24.7 C
Hyderabad
Monday, August 3, 2026

మాజీ ఎంఈఓ పై కేసు నమోదు

Must read

📰 Generate e-Paper Clip

రుద్రూర్ (వర్ని), బతుకమ్మ:  వర్ని మండల కేంద్రంలో మాజీ విద్యాశాఖ అధికారి విజయలక్ష్మి పై పోలీసులు కేసు నమోదు చేశారు. బోగస్ వీలునామా తయారు చేసి  తొమ్మిది ఎకరాల భూమిని ఆమె కుమారుడు అనిల్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేయించు కున్నాడనే అభియోగం పై కేసు నమోదు చేశారు. మాజీ ఎంఈఓ ఆమె కుమారుడుతో పాటు ఆమె బంధువు గోవర్ధన్ రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి లక్ష్మణ్, రాజు అనే వ్యక్తుల  పైన వర్ని పోలీసులు కేసు నమోదు చేశారు.

  • కేసు వివరాలు..

వర్ని మండల కేంద్రానికి చెందిన లోకం సాంబశివరావు హైదరాబాద్ లో మృతి చెందాడు. మల్లారెడ్డి ఆసుపత్రి లో మృతి చెందిన సాంబశివరావు అంత్యక్రియలు అయన స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో నిర్వహించారు. సాంబశివరావు తమ తల్లిని వివాహం చేసుకున్నారని వీలు నామ తయారు చేసి సాంబశివరావు ఆస్తి తొమ్మిది ఎకరాలు భూమి ని అనిల్ రెడ్డి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్ కు ముందే గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి సాంబ శివ రావు మొదటి భార్య ఆమె కుమారుల పై తనకు ఈ తొమ్మిది ఎకరాలు విక్రయించాడని బోధన్ కోర్టు లో కేసు నమోదు చేశారు. బోగస్ వీలు నామాతో  వీలు నామ తో జరిగిన భూముల రిజిస్ట్రేషన్ పై విచారణ జరపాలని వచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

More articles

Latest article