బతుకమ్మ, కోటగిరి : పోలీస్ అంటే కఠినత్వమే కాదు.. కరుణ గుణం ఉంటుందని స్థానిక ఎస్ఐ సునీల్ నిరూపించారు. కోటగిరి మండల కేంద్రం నుండి పొతంగల్ వైపు వెళ్లే ప్రధాన రహదారి ఎన్టీఆర్ చౌరస్తా వద్ద కొన్నేళ్లుగా గుంతల మయంగా ఉండడంతో ప్రయాణికులు, వాహనదారుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ సంబంధిత శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో గమనించిన ఎస్ఐ సునీల్ ప్రజల సౌకర్యార్థం తన సొంత ఖర్చుతో ప్రధాన రహదారిపై ఉన్న గుంతలను పూడ్చడంతో ప్రజలు ఎస్ఐ సునీల్ కు సెల్యూట్ పోలీస్ అన్నా అంటూ అభినందనలు తెలిపారు.

