వెబ్ న్యూస్, బతుకమ్మ : కేరళ రాష్ట్రం కొచ్చిలోని సదరన్ నేవల్ కమాండ్ లో ఐఎన్ఎస్ ఇక్షక్ గురువారం జలప్రవేశం చేసింది.ఈకార్యక్రమానికి చీప్ ఆప్ నావల్ స్టాఫ్ అడ్మిరల్ దినేశ్ కె త్రిపాఠి హాజరయ్యారు. ఈ నౌక జలప్రవేశంతో సముద్ర సర్వే వ్యవస్థలో కీలక ముందడుగుపడింది. దేశ రక్షణలో నూతన అధ్యాయం ప్రారంభమైంది. ఈనౌకను గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించింది.
