26.6 C
Hyderabad
Monday, August 3, 2026

వరి ధాన్యం లారీ బోల్తా

Must read

📰 Generate e-Paper Clip

  • వాహనాలు రాకపోకలు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం

 

ఇందల్వాయి,బతుకమ్మ : మండల కేంద్రంలోని ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద ధాన్యం లోడుతో వెళ్తున్న లారీ బుధవారం బోల్తా పడింది. ఈ సందర్భంగా టోల్ ప్లాజా వద్ద యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో ప్రమాదవశాత్తు లారీ బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. సిరికొండ మండలం చీమనుపల్లి కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యం తీసుకొని లారీ నిజామాబాదుకు బయలుదేరింది. టోల్ ప్లాజా వద్ద యూటర్న్ తీసుకుంటున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు వారు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగలేనట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద సమయంలో వాహనాలు రాకపోకలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

More articles

Latest article