27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఎస్సారెస్పీ 4 గేట్ల ద్వారా కొనసాగుతున్న నీటి విడుదల

Must read

📰 Generate e-Paper Clip

మెండోరా, బతుకమ్మ :  శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 21,954 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్టు ఏ ఈ ఈ రవి తెలిపారు. దీంతో  ప్రాజెక్ట్ 4 గేట్లని ఎత్తి 12,500 క్యూసెక్కుల నీటి విడుదల గోదావరిలోకి కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రాజెక్టు  ఎస్కేప్ గేట్ల ద్వారా 8,000 క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 1091.00 అడుగులు, 80.501 టిఎంసిల నీరు ఉంది.

More articles

Latest article