- అధికారులకు రైతు చర్చమండలి సభ్యుల ఫిర్యాదు
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గల రైతు చర్చ మండలి ఎదురుగా ఏర్పాటు చేయబోతున్న వైన్స్, పర్మిట్ రూముకు అనుమతి ఇవ్వవద్దని కోరుతూ ఎల్లారెడ్డిపేట రైతు చర్చ మండలి ఆధ్వర్యంలో ఆబ్కారి సిఐ శ్రీనివాస్ కు,మండల తహాసిల్దార్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సభ్యులు మాట్లాడుతూ రైతు చర్చ మండలిలో శుభకార్యాలు జరుగుతాయని, అదే విధంగా పాలకేంద్రం కూడా నిర్వహిస్తామని, దీని పక్కనే మహిళలకు సంబంధించి బీడీ కంపెనీ ఉందని అదేవిధంగా అంగన్వాడి కేంద్రం సైతం ఉందని వైన్స్ ఏర్పాటు చేయడం వల్ల రైతు చర్చ మండలి కి ఇబ్బందవుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. అదేవిధంగా గతంలో ఇక్కడ వైన్స్ ఏర్పాట్లు కూడా అడ్డుకోవడం జరిగిందని అదే స్థానంలో వైన్స్ ఏర్పాటు చేయడం సరికాదని ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా చుట్టుపక్కల మహిళలు నివాసం ఉంటారని పర్మిట్ రూమ్ తో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారని అధికారులకు విన్నవించుకున్నారు. గతంలో కూడా ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరిగాయని వెంటనే వైన్స్ ఏర్పాటు అనుమతి నిలిపివేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి బంధారపు లక్ష్మారెడ్డి, నేవూరి శ్రీనివాస్ రెడ్డి, సందుపట్ల రాజిరెడ్డి, గన్నరాజిరెడ్డి, గన్న శ్రీనివాస్ రెడ్డి, మద్దుల రవీందర్ రెడ్డి, మద్దుల బాలకిషన్ రెడ్డి తోపాటు 50 మంది రైతు చర్చ మండలి సభ్యులు పాల్గొన్నారు.

