రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని పద్మశాలి సంఘం లో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 9:00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉచిత కంటి పరీక్షలు, దంత పరీక్షల శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇందులో లయన్స్ కంటి ఆసుపత్రి నుండి కంటి నిపుణులు, హోప్ వెల్ హాస్పిటల్ నుండి దంత వైద్యులు డాక్టర్ ఇర్ఫాన్ అలీ గార్ల చే వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని లయన్స్ క్లబ్ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.
