మెండోరా, బతుకమ్మ:శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం పూర్తయింద ని జెన్ కో డి ఈ ఈ శ్రీనివాస్ తెలిపారు. ఈ సంవత్సరం లక్ష్యం 67 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా ఇప్పటివరకు 67.42 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి చేసినట్లు పేర్కొన్నారు. వర్షాలు అధికంగా కురవడం ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం రావడంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఐదు నెలల ముందు గాని లక్ష్యానికి ఇది ఉత్పత్తి చేరుకుందని తెలియజేశారు. దీంతో జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అధికారులు సిబ్బంది సంతోషం వ్యక్తం చేశారు.
సంవత్సరాలు. మి.యూ
2020-21. 90.7656
2021-22. 109.8417
2022-23. 138.9207
2023-24. 75.8692
2024-25. 66.7381
2025-26. 67.4236 (ఆదివారం వరకు)
జల వీధి ఉత్పత్తి కేంద్రంలో నారు టర్బైన్లు ఉన్నాయి. ఒక్కొక్క టర్బో ఏం ద్వారా 9 మెగావాట్ల చొప్పున 36 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టే సామర్థ్యం ఉంది. కానీ ప్రస్తుత సంవత్సరం సామర్థ్యానికి మించి 36.5 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి వరకు జరిగింది. ప్రాజెక్ట్ నీటిమట్టం నిండుకుండలా ఉండడంతో పాటు నీరు వేగంగా రావడం ద్వారా సామర్థ్యానికి మించి విద్యుత్ ప్రత్తి సాధ్యమైందని అధికారులు పేర్కొన్నారు. రోజుకు 0.87 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది.
