నిజామాబాద్, బతుకమ్మ : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జాన్ ఇద్దరికి జైలు, 21మందికి జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపిన 23 మందికి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. అనంతరం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జాన్ ముందర హాజరుపరచగా ఎల్లమ్మ గుట్టకు చెందిన బండి శ్రీకాంత్, వడ్డెర కాలనీకి చెందిన అల్లపు రమేష్ లకు రెండు రోజుల జైలు శిక్ష విధించారని తెలిపారు.
