28.8 C
Hyderabad
Monday, August 3, 2026

నిరుపేద యువతి వివాహానికి బియ్యం, నగదు వితరణ

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : తల్లిదండ్రులు లేని యువతి వివాహానికి 50 కిలోల క్వాలిటీ బియ్యంను అమ్మ ఫౌండేషన్ చైర్మన్ ఆకుల మురళీమోహన్ గౌడ్ అందజేశారు. ఇద్దరు ఆడపిల్లలకు తల్లి దండ్రులు చిన్నప్పుడే మృతి చెందగా వారి పెద్దనాన్న  గోపాల్ పల్లి గ్రామానికి చెందిన  దొమ్మాట రాములు చంద్రవ్వలు జ్యోత్స్న,జ్యోతికలను పెంచి పోషించారు.పెంచిన పెద్దనాన్న రాములు ఇటీవల మరణించారు.ఇద్దరిలో పెద్ద అమ్మాయి జ్యోత్స్న దివ్యాంగురాలు.చిన్నమ్మాయి జ్యోతిక వివాహం నవంబర్ 7 న ఉండడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న కుటుంబం,చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో రిపోర్టర్ శ్ర‌ీనివాస రాజు సోషల్ మీడియాలో ఆ కుటుంబం యొక్క దీనగాధను వర్ణించడంతో తన వంతుగా అమ్మ ఫౌండేషన్ చైర్మన్ ఆకుల మురళీమోహన్ గౌడ్   50 కిలోల క్వాలిటీ బియ్యంను యువతి వివాహానికి అందించారు. అలాగే చేపూరి రాజేశం గుప్త 50 కిలోల క్వాలిటీ బియ్యం,ఆకుల నాగభూషణం, రాజశేఖర్ గౌడ్ లు 1500 రూపాయల నగదును ఆర్థిక సహాయం అందించడంతో ఆదివారం అమ్మ ఫౌండేషన్ పక్షాన ఆ కుటుంబానికి అందించారు.  ఎవరైనా మనవతా దృక్పథంతో దాతలు సహాయం చేయాలంటే ఫోన్ పే నంబర్ 9502760046 సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

Rice and cash distributed for the wedding of a poor young woman

More articles

Latest article