నిరుపేద యువతి వివాహానికి బియ్యం, నగదు వితరణ
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : తల్లిదండ్రులు లేని యువతి వివాహానికి 50 కిలోల క్వాలిటీ బియ్యంను అమ్మ ఫౌండేషన్ చైర్మన్ ఆకుల మురళీమోహన్ గౌడ్ అందజేశారు. ఇద్దరు ఆడపిల్లలకు తల్లి దండ్రులు చిన్నప్పుడే మృతి చెందగా వారి పెద్దనాన్న గోపాల్ పల్లి గ్రామానికి చెందిన దొమ్మాట రాములు చంద్రవ్వలు జ్యోత్స్న,జ్యోతికలను పెంచి పోషించారు.పెంచిన పెద్దనాన్న రాములు ఇటీవల మరణించారు.ఇద్దరిలో పెద్ద అమ్మాయి జ్యోత్స్న దివ్యాంగురాలు.చిన్నమ్మాయి జ్యోతిక వివాహం నవంబర్ 7 న ఉండడంతో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్న కుటుంబం,చేతిలో చిల్లి గవ్వ లేకపోవడంతో రిపోర్టర్ శ్రీనివాస...