25.8 C
Hyderabad
Sunday, August 2, 2026

క్లీన్ ఇండియా బ్యూటిఫుల్ ఇండియా

Must read

📰 Generate e-Paper Clip

మోర్తాడ్, బతుకమ్మ: పరిశుభ్రత పై విద్యార్థులకు అవగాహన పెంచడమే”స్వచ్ఛత పక్షోత్సవాల” లక్ష్యం అని ‘స్వచ్ఛత పక్వాడ’ నినాదం :క్లీన్ ఇండియా బ్యూటిఫుల్ ఇండియా అని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ప్రమీల రాణి అన్నారు. మోర్తాడ్ మండలంలోని పాలెం గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో అక్టోబర్ 17 నుండి 31 వరకు ‘స్వచ్ఛత పక్వాడా’ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. మొదటి రోజు విద్యార్థులచే ‘స్వచ్ఛత ప్రతిజ్ఞ’ చేయించి, 2వ&3వ రోజు విద్యార్థులకు ‘పరిసరాల పరిశుభ్రత’పై స్వచ్చత అవగాహన, 4వ రోజు  ‘హరిత దినోత్సవం’ పాఠశాలల్లో విద్యార్థులతో మొక్కలు నాటించే కార్యక్రమం, 5వ రోజు పాఠశాలను సమాజానికి చేరువ చేసి స్థానిక ప్రజలతో, విద్యావేత్తలతో విద్యార్థులను మమేకం చేయడం, 6వ రోజు ‘హ్యాండ్ వాష్ డే’ లో బాగంగా విద్యార్థులకు చేతులను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మధ్యాహ్న భోజన సమయంలో చేతులను సరిగా కడుక్కోవడం, చేతులను శుభ్రం చేసే విధానాలను నేర్పించడం, 7వ రోజు ‘స్వచ్ఛత భాగస్వామ్యం’ లో భాగంగా విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాస, క్విజ్ పోటీలు నిర్వహించడం, 8వ రోజు ‘వ్యక్తిగత పరిశుభ్రత దినోత్సవం’ ను నిర్వహించి విద్యార్థులకు వ్యక్తిగత ఆరోగ్య పరిశుభ్రతపై అవగాహన కల్పించి, 9వ రోజు పాఠశాల స్థాయిలో విద్యార్థులచే “స్వచ్ఛత”  పై ‘ఎగ్జిబిషన్ డే’ నిర్వహించారు. 10వ & 11వ  ఉపాధ్యాయులు విద్యార్థులతో పాఠశాల స్వచ్ఛతపై ప్రణాళిక, కార్యాచరణ విధానాన్ని సిద్ధం చేయించారు. 12వ రోజు ‘స్వచ్చత పక్వాడ ముగింపు దినోత్సవం’ నిర్వహించి వివిధ కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు ప్రతి రోజు నిర్వహించిన పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులను అందజేశారు.  కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article