26.3 C
Hyderabad
Monday, August 3, 2026

తెలంగాణ యూనివర్సిటీ భూముల జోలికి వస్తే ఖబర్దార్

Must read

📰 Generate e-Paper Clip

  • పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఉన్న భూముల గులికి వస్తే ఖబర్దార్ అని, కబ్జాకు గురవుతున్న తెలంగాణ యూనివర్సిటీ భూములను కాపాడాలని పి.డి.ఎస్.యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజ్ ఎదుట తే. యూ పి.డి.ఎస్.యూ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ యూనివర్సిటి భూమిని హైకోర్టు లో కేసు వేసి అన్యాయంగా అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ గుప్పిట్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీన్ని మేం చూస్తూ ఊరుకోం ,
తెలంగాణ యూనివర్సిటీ సాధించుకున్న విద్యార్థులుగా మళ్ళీ యూనివర్సిటీ భూములను కాపాడుకోవడానికి తాము మరో ఉద్యమానికి సిద్ధం , యూనివర్సిటీ భూముల జోలికి వస్తె ఖబర్దార్ ఒక్క అంగుళం భూమిని కూడా వదిలే ప్రసక్తే లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో తే.యూ పి.డి.ఎస్.యూ నాయకులు రవీందర్, బిందు,హనుమాండ్లు, వేణు తదితరులు పాల్గొన్నారు.

More articles

Latest article