27.1 C
Hyderabad
Saturday, August 1, 2026

వరి కొనుగోలు పరిశీలించిన సబ్ కలెక్టర్ వికాస్ మహాతో

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, బోధన్: బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ గురువారం బోధన్ మండలంలోని పెంటకలాన్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం  ను సందర్శించి, రైతులతో వరి కొనుగోలు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు సబ్  కలెక్టర్ కి వివరాలు అందిస్తూ, ఇప్పటివరకు 127 లారీలు రైస్‌మిల్లులకు తరలించగా, 127 లారీలు మిల్లుల్లో దిగ్వజ్జం చేయబడ్డాయని, అలాగే 113 బిల్లులు OPMS సిస్టంలో నమోదు చేయబడ్డాయని తెలిపారు. సబ్  కలెక్టర్ వికాస్ మహాతో  ప్రతి రవాణాకు ట్రక్ షీట్ తప్పనిసరిగా రూపొందించాలని, రైస్‌మిల్లులతో నిరంతర సమన్వయం కొనసాగిస్తూ, సమయానికి అంగీకారాలు బిల్లుల అప్‌లోడ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వరి కొనుగోలు కేంద్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా సబ్  కలెక్టర్  తెలుసుకుని, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

Sub-Collector Vikas Mahato inspects paddy procurement

More articles

Latest article