27.6 C
Hyderabad
Sunday, August 2, 2026

ఇసుక, మొరం అక్రమ తవ్వకాలకు చెక్

Must read

📰 Generate e-Paper Clip

బతుకమ్మ, మాక్లుర్ : మాక్లుర్ మండలంలోని అనుమతులు లేకుండా ఇసుక,మెరం రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తాసిల్దార్ శేఖర్ తెలిపారు. బుధవారం మండలంలోని ఇంద్రరమ్మ ఇండ్ల లబ్ధిదారుల కోసం  వల్లబాపూర్ పెద్ద వాగు నుండి అనుమతులు ఇచ్చారు. అక్రమంగా ట్రాక్టర్ డ్రైవర్లు అదికారులకు తెలియకుండా అనుమతి లేని చోట ఇసుక పోయడానికి ప్రయత్నించడంతో తాసిల్దార్ శేఖర్ పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రభుత్వ నిబంధనల మేరకే విధులు నిర్వహించాలని అధికారులకు  సూచించారు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహించిన ఎడల ఎంతటి వారినైనా ఉపేక్షించలేదని హెచ్చరిస్తుంటారు. అనుమతులు లేకుండా ఇసుక మొరం తవ్వకాలకు విక్రమార్కుడుగా మండలంలోని తన విధులు నిర్వహించడంతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అనుమతులు పొందిన తర్వాతనే ఇసుక, మొరం తవ్వకాలు నిర్వహించాలని మండల ప్రజలకు సూచించారు.

More articles

Latest article