31 C
Hyderabad

మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన చిరంజీవి

Must read

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,బతుకమ్మ : మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులను చిరంజీవి ఆశ్రయించాడు.  సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకరమైన పోస్టులు పెడుతున్నారని  ఈ మేరకు ఓ ‘ఎక్స్’ ఖాతాను జోడిస్తూ సైబర్ క్రైమ్ పోలీసులకు చిరంజీవి ఫిర్యాదు చేశారు.  ఇటీవల హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ఇంకా ఇలాంటి పోస్టులు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని  చిరంజీవి కోరారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. తన పేరు, ఫొటో, వాయిస్ లను అనుమతి లేకుండా ఉపయోగిస్తున్నారని చిరంజీవి ఇటీవల సిటి సివిల్ కోర్టును ఆశ్రయించాడు. వాణిజ్య ప్రయోజనాల కోసం చిరంజీవి పేరును వాడొద్దని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

More articles

Latest article