30.2 C
Hyderabad
Sunday, August 2, 2026

డివిజన్ వార్ రూంలు ఏర్పాటు చేయాలి : రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

Must read

📰 Generate e-Paper Clip

డిల్లీ, బతుకమ్మ : ’మొంథా‘ తీవ్ర తుఫాను నేపథ్యంలో సత్వర నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా ఒడిశా, తెలుగు రాష్ట్రాల్లో డివిజన్ వార్ రూంలు ఏర్పాటు చేయాలని దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎంలను రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆదేశించారు.  దక్షిణ మధ్య రైల్వే, ఈస్ట్ కోస్ట్ రైల్వే జీఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మొంథా తుఫాను నేపథ్యంలో తీసుకుంటున్న చర్యలపై నివేదిక కోరారు. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు డివిజన్లలో అవసరమైన సామగ్రి, యంత్రాలు సిబ్బందిని సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. అత్యవసర వేళల్లో సత్వరం స్పందించాలన్నారు.

More articles

Latest article