28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

బిచ్కుందలో ఘనంగా 109 వ కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

Must read

📰 Generate e-Paper Clip

 

బతుకమ్మ: బిచ్కుంద

స్వాతంత్ర సమరయోధుడు బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జీవిత చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పద్మశాలి సంఘం డివిజన్ అధ్యక్షులు రాజు డాక్టర్ అన్నారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి ఉత్సవాలను బిచ్కుంద మండల కేంద్రంలోని స్థానిక మార్కండేయ మందిరంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మశాలి సంఘం డివిజన్ అధ్యక్షులు రాజు డాక్టర్ తో కలిసి కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్విట్ ఇండియా పోరాటంలో కొండా లక్ష్మణ్ బాపూజీ కీలక పాత్ర పోషించారని తెలిపారు. దేశం కోసం బాపూజీ కుటుంబం అనేక త్యాగాలు చేశారని కొనియాడారు. రాచరిక పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన మహానీయుడని పేర్కొన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ దేశానికే ఆస్తి అని పేర్కొన్నారు. మహనీయుల జయంతులను ప్రభుత్వమే నిర్వహించడం సంతోషదాయకమన్నారు.పద్మశాలి సంఘం క్రియాశీలక వ్యక్తి గంగుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నాంది పలికారని పేర్కొన్నారు. బాపూజీ ఉద్యమం కేవలం పద్మశాలిల కోసమే చేయలేదని, యావత్ సమాజం కోసం చేశారని తెలిపారు. మహనీయుడి జయంతి ఉత్సవాలను రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ప్రపంచం గర్వించేవిధంగా చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గంగాధర్, బుర్రి సురేష్, జగదీష్, అంబదాస్, బాలరాజ్, శివ, శేర్ల లక్ష్మణ్, ఖాత్గవ్ మాజీ సర్పంచ్ హన్మాండ్లు, బాలకిషన్, సురేష్ తదితరులు పాల్గొన్నారు

More articles

Latest article