- జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, బతుకమ్మ : పోలీస్ అమరులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా శనివారం కామారెడ్డిలో సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరులు చేసిన త్యాగాలు, కఠినతరమైన విధులను ప్రతి ఒక్కరికీ తెలియజేశాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఈ ర్యాలీ పొందుర్తి – కామారెడ్డి ఎంట్రెన్స్ నుంచి ప్రారంభమై జీఆర్ కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నిజాంసాగర్ చౌరస్తా, మున్సిపల్ కార్యాలయం, బస్టాండ్, సరస్వతి శిశుమందిర్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గుండా సాగుతూ కళాభారతి వద్ద ముగిసిందని తెలిపారు. ప్రజలతో పోలీసుల సత్సంబంధాలను మెరుగుపరుచుకుంటూ, పబ్లిక్ పోలీస్ రిలేషన్ ను మరింత పెంపొందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి అదనపు ఎస్పీ కె.నరసింహారెడ్డి, ఏఎస్పీ బి.చైతన్య రెడ్డి, బాన్సువాడ డీఎస్పీ బి.విఠల్ రెడ్డి, ఇన్స్ పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్ పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది, వివిధ కాలేజీల విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.

