29.4 C
Hyderabad
Sunday, August 2, 2026

భార్య ఆత్మహత్య కేసులో భర్తకు ఐదేళ్ల జైలు

Must read

📰 Generate e-Paper Clip

  • నిజామాబాద్ అసిసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ తీర్పు

 

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : భార్య ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన భర్తకు ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విదిస్తూ నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సాయిసుధ గురువారం తీర్పు వెలువరించారు. డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మి నర్సయ్య తెలిపిన వివరాలు. డిచ్ పల్లి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన చెన్నూరు నరేష్, ధర్మారం ( బి ) గ్రామ నివాసురాలైన సౌమ్య ల వివాహం హిందూ వివాహ సంప్రదాయం ప్రకారం జరిగింది. వీరికి ఐదు సంవత్సరాల కుమారుడు, పదిహేను నెలల కుమారుడు ఉన్నారు. నరేష్ కు ఒక మహిళతో అక్రమ సంబంధం ఏర్పారచుకున్నాడు. భార్య సౌమ్య ను చీటికీ మాటికీ మానసిక, శరీర చిత్ర హింసలకు గురి చేసేవాడు. ఈ విషయంలో ఇరు కుటుంబాల మధ్య పంచాయతీ నిర్వహించి నరేష్ కు నచ్చజెప్పే ప్రయత్నాలు జరిగాయి. అయిన నరేష్ ప్రవర్తనలో మార్పు రాలేదు. ఎప్పటి మాదిరిగానే భార్యను చిత్రహింసలకు గురిచేశాడు. భర్త పెట్టె శరీరక, మానసిక భాధలను తట్టుకోలేని సౌమ్య 25 పిబ్రవరి, 2021  న అత్తగారి ఇంటిలోనే చీరను మెడకు కట్టుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.సౌమ్య అన్న గంజి రాజు పిర్యాదు మేరకు నేర విచారణ జరిపిన పోలీసులు సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసుకుని, నేర స్థల పంచానామా, నేర స్థలంలో లభించిన సాక్ష్యాలు, సౌమ్య మృత దేహానికి వైద్యులు నిర్వహించిన పోస్ట్ మార్టమ్ నివేదిక, ఫారెన్సిక్ రిపోర్ట్, ఇతర సాక్ష్యాలతో అభియోగ పత్రాన్ని కోర్టులో సమర్పించారు. అభియోగ పత్రం అదారంగా సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేసుకుని, ధ్రువీకరించుకున్న పత్రాలను, వస్తుగత సాక్ష్యాలను మార్క్ చేసిన కోర్టు ప్రాసిక్యూషన్, ముద్దాయి తరపున న్యాయవాది వాదనలు విని ముద్దాయి నరేష్ పై నేర నిరూపణ అయినట్లు నిర్దారించింది. భార్య ఆత్మహత్య చేసుకోవడానికి కారకుడైన నరేష్ కు భారత శిక్షస్కృతి సెక్షన్ 306 ఆత్మహత్య కు ప్రేరేపించినందుకుగాను ఐదు సంవత్సరాల కఠిన జైలుశిక్ష విదిస్తూ జడ్జి సాయిసుధ తీర్పు చెప్పారు.

More articles

Latest article