28.7 C
Hyderabad
Saturday, August 1, 2026

మద్యం సేవించి వాహనాలు నడపొద్దు

Must read

📰 Generate e-Paper Clip

ఎల్లారెడ్డి, బతుకమ్మ : ఎల్లారెడ్డి పట్టణంలో మద్యం సేవించి వాహనాలు నడపకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. ఇటీవల మద్యం తాగి వాహనాలు నడిపిన ఇద్దరిపై పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌.ఐ. మహేష్ మాట్లాడుతూ, పెండింగ్‌లో ఉన్న చలాన్లు చెల్లించిన వాహనదారుల నుండి మొత్తం రూ.20,000 వసూలు చేసినట్లు తెలిపారు. ప్రతి ద్వి చక్రాల వాహనదారు తమ వాహనానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సి, ఇన్సూరెన్స్ వంటి పత్రాలను తప్పనిసరిగా వెంట తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి రైడర్ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల కేవలం ఒకరి ప్రాణమే కాదు, ఒక కుటుంబం జీవితమంతా దెబ్బతింటుందని హెచ్చరించారు. ఒక ప్రాణం విలువ అంటే ఒక కుటుంబం విలువే అని ఎస్‌.ఐ. మహేష్ గుర్తుచేశారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు అందరూ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని, పెండింగ్ చలాన్లు వెంటనే చెల్లించి పోలీసులకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌.ఐ. మహేష్ తో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Do not drink and drive.

More articles

Latest article