24 C
Hyderabad
Sunday, August 2, 2026

తెలంగాణలో ఆర్టీఏ చెక్ పోస్టులు రద్దు

Must read

📰 Generate e-Paper Clip

  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • సాయంత్రానికే ఎత్తివేయాలని కమిషనర్ ఆదేశాలు
  • ఆర్టీఏలో పారదర్శకత కోసమే ప్రభుత్వ నిర్ణయం
  • రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

 

హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలోని అన్నిరవాణా శాఖ చెక్‌పోస్టుల కార్యకలాపాలు తక్షణమే నిలిపివేయాలని ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న సిబ్బందిని వెంటనే పునర్వినియోగం చేయాలని ఆదేశించారు. చెక్ పోస్టుల వద్ద బోర్డులు, బ్యారికేడ్లు తొలగించాలని డీటీవోలకు సూచించారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న రికార్డులు, పరికరాలు, ఫర్నిచర్‌ను డీటీవో కార్యాలయాలకు తరలించాలని ఆదేశించారు. అన్ని ఆర్థిక, పరిపాలనా రికార్డులను సరిచూసి భద్రపరచాలని ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం 5 గంటలలోగా మూసివేతపై పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. చెక్ పోస్టుల రద్దు చేస్తూ ప్రజల్లో అవగాహన కలిగించడానికి, ట్రాన్స్పరెంట్ గా ఆన్లైన్ లో  జరగడానికి చెక్  పోస్టులను రద్దు చేస్తూ రెండు నెలల క్రితం నిర్ణయం తీసుకొని బుధవారం నుంచి చెక్  పోస్టులు పూర్తిగా మూసివేస్తూ అమలు చేస్తున్నామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ లో ఈవి పాలసీ తీసుకొచ్చిన తర్వాత 577 కోట్ల టాక్స్ ప్రభుత్వం మినహించిందన్నారు. ఇవీ వెహికిల్ అమ్మకాల షేర్ 0.03నుండి 1.13 షేర్ పెరిగిందన్నారు. ఢిల్లీలో పొల్యూషన్ లో ఉండే పరిస్థితి లేదని, ఇక్కడ అలాంటి పరిస్థితి లేకుండా ఉండడానికి ఇవి పాలసీ తీసుకొచ్చాం అని పేర్కొన్నారు. నగరంలో 20 వేల ఎలక్ట్రిక్ ఆటో లకు అనుమతి ఇచ్చాం.. ఎల్పీజీ, సీఎన్జీ ఆటో లకు 10 వేలు చొప్పున అనుమతి ఇచ్చామన్నారు. 25వేల  రేటిరోఫిటింగ్ ఆటో లకు అనుమతి ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలో వాహన్  అమలవుతుంది.. సారథి త్వరలోనే తీసుకొస్తాం.. స్క్రాపింగ్ పాలసీ తీసుకొచ్చాం.. వాహనాలకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం రేడియం స్టిక్కర్స్ అమలయ్యేలా తెచ్చామని తెలిపారు. ఏ1 టెక్నాలజీ ను ఉపయోగించి రవాణా శాఖ కార్యాలయాల్లో రికార్డ్ చేస్తూ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళని నోట్ చేసి హెడ్ ఆఫీస్ కి అలెర్ట్ చేస్తుందన్నారు. అలాంటి వాటిని నిరోధించడానికి ఉపయోగిస్తున్నామని తెలిపారు. వెహికిల్ ట్రాకింగ్ ప్రాసెస్ కొనసాగిస్తున్నామన్నారు. డ్రైవింగ్ మీద మంచి నైపుణ్యాలు పెంచడానికి అవగాహన కలిగించడానికి కార్యక్రమాలు, రోడ్ సేఫ్టీ పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. రోడ్ సేఫ్టీ చిల్డ్రన్ అవేర్నెస్ పార్క్ లు ఏర్పాటు చేస్తున్నామని, నాచారం లో గవర్నర్ ప్రారంభించారని ,కరీంనగర్ లో ప్రారంభించామని తెలిపారు. ఆటోమేటిక్ డ్రైవింగ్ లైసెన్స్ సిస్టమ్ తీసుకొస్తున్నామన్నారు. టూరిజం వెహికల్స్ కి డబుల్ నెంబర్ ప్లేట్ తో పోతున్నాయని ఆరోపణల నేపథ్యంలో హై సెక్యూరిటీ ప్లేట్స్ తీసుకొస్తున్నామని పేర్కొన్నారు. రోడ్ సేఫ్టీ క్లబ్స్ కాలేజీలలో జూనియర్, డిగ్రీ ఇతర వాటిలో అవగాహన కల్పించేలా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం క్యాష్ లెస్ ట్రీట్మెంట్ కార్యక్రమాన్ని తీసుకొచ్చిందని, దాని  అమలు పై మెడికల్ ,పోలీస్, నేషనల్ హైవేస్ తో సమీక్షా సమావేశం నిర్వహించామని తెలిపారు. రవాణా శాఖ రెవెన్యూ కలెక్షన్ చేసే డిపార్ట్మెంట్.. 112 మంది ఏఎంవీఐ లను నియమించి వారికి శిక్షణ ఇచ్చి తీసుకున్నామన్నారు. నలుగురు ఆర్టీవో లను గ్రూప్ 1ద్వారా వచ్చారని, రవాణా శాఖ కు ఒక లోగో తీసుకొచ్చామని తెలంగాణ పోలీస్, ఫారెస్ట్ మాదిరి లోగో తీసుకున్నామని తెలిపారు. టీఎస్ ను టీజీగా మార్చామని తెలిపారు. ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలని సూచించారు. ఇల్లీగల్, ఓవర్ లోడింగ్ ఎన్ఫోర్స్ మెంట్ పై  ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 1.7 కోట్ల వాహనాలు ఉన్నాయని, వాటన్నిటిని రోడ్ ప్రమాదాలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డిపార్ట్మెంట్ లో పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పాత వాహనాలు డబుల్ నంబరింగ్ అరికట్టడానికి మైనింగ్, ఇతర  వాహనాలకు మొదటగా చూస్తున్నామని తెలిపారు. రవాణా శాఖ లోని 63 కేంద్రాల్లో కెమెరా ల ద్వారా పర్యవేక్షణ  జరుగుతుందన్నారు. బ్రోకర్ వ్యవస్థను అరికట్టడానికి కఠినచర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలీస్ శాఖ, ఆర్టీసీ ఇతర విభాగాలలో పాత వాహనాలకు స్క్రాప్ కి పంపించాలని లేఖ రాశామని తెలిపారు. చెక్ పోస్టులను రద్దు చేయాలని తానే ముఖ్యమంత్రి దృష్టికీ తీసుకుపోయి కేబినెట్ లో పెట్టడం జరిగిందని తెలిపారు. వచ్చే ఆదాయాన్ని ఆన్లైన్ ద్వారా చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గత 10 సంవత్సరాల్లో పాపాల పుట్ట లాగ అవినీతి జరిగిందన్నారు. వాహన్ సారథి లో 28 రాష్ట్రాలు ఉన్నాయని, గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఎందుకు చేరలేదని అన్నారు. ఇప్పుడు తాము వాహన్ సారథి లో చేరామని, డేటా ట్రాన్ఫర్మింగ్ జరుగుతుందని, వాహన్ అమలు చేస్తున్నామని, సారథి అమలు చేస్తామని తెలిపారు.

More articles

Latest article