తెలంగాణలో ఆర్టీఏ చెక్ పోస్టులు రద్దు

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాయంత్రానికే ఎత్తివేయాలని కమిషనర్ ఆదేశాలు ఆర్టీఏలో పారదర్శకత కోసమే ప్రభుత్వ నిర్ణయం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్   హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణలోని అన్నిరవాణా శాఖ చెక్‌పోస్టుల కార్యకలాపాలు తక్షణమే నిలిపివేయాలని ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. చెక్ పోస్టుల వద్ద ఉన్న సిబ్బందిని వెంటనే పునర్వినియోగం చేయాలని ఆదేశించారు. చెక్ పోస్టుల వద్ద బోర్డులు, బ్యారికేడ్లు తొలగించాలని డీటీవోలకు సూచించారు. వాహనాల రాకపోకలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు....