- జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి
డిచ్ పల్లి, బతుకమ్మ : విద్యార్థులు మంచి చదువులు చదువుకొని తల్లిదండ్రుల అభిష్టం మేరకు సర్కారు కొలువులను సాధించాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని సుద్దపల్లి గ్రామంలోని గ్రంథాలయాన్ని ఆయన సందర్శించారు. అక్కడ గ్రంథాలు చదువుతున్న రీడర్స్ ను కలిసి మాట్లాడారు. ఈ గ్రంథాలయంలో ఉన్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్. భూపతి రెడ్డి సూచన మేరకు ఈ గ్రంథాలయానికి తాను రావడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా రీడర్స్ ఇక్కడి సమస్యలను వివరించిన వెంటనే ఈ గ్రంథాలయానికి రెండు కంప్యూటర్లు, 6 లైట్లు, రూ. 30 వేలతో యుపీవిసీ కిటికీలతో పాటుగా మరుగుదొడ్ల నిర్మాణంనకు గాను రూ. 65వేల నిధులను మంజూరు చేయించి, పనులన్నింటిని పూర్తి చేసేందుకు తనవంతు సహకారం అందిందిస్తానన్నారు.తమ గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్. భూపతి రెడ్డికి, గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి లకు గ్రామాభివృద్ధి కమిటీ ధన్యవాదాలు తెలిపింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రూపా సతీష్ రెడ్డి, యువకుడు వినోద్ రెడ్డి గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు పానుగంటి జనార్దన్ రెడ్డి కోమటి రామన్ బొల్లారం గణేష్, ఆరెపల్లి మోహన్ గ్రామస్తులు దుంపటి భూమయ్య పావురాజ్ సుబ్బయ్య, సాంపల్లి మాజీ సర్పంచ్ నరసయ్య గ్రంథాలయంలో చదువుకుంటున్న యువకులు పాల్గొన్నారు.
