విద్యార్థులు చదువుకొని సర్కారు కొలువులు సాధించాలి

జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి   డిచ్ పల్లి, బతుకమ్మ : విద్యార్థులు మంచి చదువులు చదువుకొని తల్లిదండ్రుల అభిష్టం మేరకు సర్కారు కొలువులను సాధించాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజారెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని సుద్దపల్లి గ్రామంలోని గ్రంథాలయాన్ని ఆయన సందర్శించారు. అక్కడ గ్రంథాలు చదువుతున్న రీడర్స్ ను కలిసి మాట్లాడారు. ఈ గ్రంథాలయంలో ఉన్న సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా చైర్మన్ మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్. భూపతి రెడ్డి సూచన మేరకు ఈ గ్రంథాలయానికి...